హమ్మయ్యా.. కవితకు బెయిల్… వాడీవేడి వాదనలు…!

లీడర్ భాస్కర్ న్యూస్ ప్రతినిధి :- BRS ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై ఇన్నాళ్లు నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి.. తిహాడ్‌ జైలులో ఉన్న కవిత బెయిల్‌పై మంగళవారం సర్వోన్నత న్యాయస్థానంలో సుదీర్ఘ విచారణ జరిగింది. కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణను జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం నిర్వహించింది. ఢిల్లీ లిక్కర్ కేసు విజయ్ నాయర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడటంతో కవిత బెయిల్ పిటిషన్ కేసు ఏమవుతుందోనన్న ఆందోళన బీఆర్ఎస్ శ్రేణుల్లో నెలకొంది. ఎట్టకేలకు బెయిల్ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *