లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు) ఇటీవల తణుకు పట్టణంలోని ఉన్నటువంటి అన్న క్యాంటీన్ శుభ్రత పై, ప్లేట్ లు ఎంగిలి నీటిలో కడుగుతున్నారు అంటూ సామజిక మధ్యమాలలో వచ్చిన ప్రచారాలు పూర్తిగా అవాస్తమని తణుకు MLA ఆరిమిల్లి రాధాకృష్ణ మండిపడ్డారు.
స్పష్టంగా “చేతులు కడుగు స్థలము” అని రాసి ఉన్న
కావాలని బురద చల్లటానికి, చేతులు కడిగే సింకులో, అన్నం తిన్న ప్లేట్లు పడేసి, అదే సమయంలో, చేతులు కడిగే సింకు బ్లాక్ అవ్వటంతో, సిబ్బంది వచ్చి ఆ ప్లేట్లు, చెత్త తీస్తున్న సమయంలో ఒక 40 సెకండ్ల వీడియో తీసి వైసీపీ నాయకులు సిగ్గు లేని తప్పుడు ప్రచారం చేపిస్తున్నారని అన్నారు.
కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నడుపుతున్న అన్న క్యాంటీన్ వలన పేదల ఆకలి తీరడం వైసీపీ సైకోలకు మింగుడుపడటం లేదని దానితో ఇలాంటి తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు.
ఎంత విష ప్రచారం చేసినా, అన్న క్యాంటీన్లు ఆగవని జగన్ & కొ ఎన్ని ఫేక్ నాటకాలు ఆడినా, కుట్రలు చేసిన ప్రజలు నమ్మరని అన్నారు.