లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు) బుధవారం తణుకు పట్టణంలోనే ఎం ఎమ్.ఎల్.ఎస్ పాయింట్ (నిత్యవసర వస్తువుల గోడౌన్) ను జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోడౌన్ లో ఉన్న సరుకును, స్టాఫ్ రిజిస్టర్ లను తనిఖీ చేసి సంతృప్తిని వ్యక్తం చేశారు. రిజిస్టర్ లోని నిల్వలకు, భౌతిక నిల్వలకు ప్రతిరోజు లెక్కలు సరిచూసుకోవాలని సూచించారు. ఆగస్టు 30 లోపుగా జిల్లాలోని అన్ని ఎమ్.ఎల్.ఎస్ పాయింట్ ల నుండి ఎఫ్.పి షాపులకు నిత్యవసర సరుకులు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ద్వారా సరఫరా అయ్యే అన్ని వస్తువులు వినియోగదారులకు సకాలంలో అందేలా చూడాలని తెలిపారు. సకాలంలో జీతాలు వస్తున్నాయా అని హమాలీలను ప్రశ్నించగా, జీతాలు వస్తున్నాయని, ఏ విధమైన ఇబ్బందులు లేవని జిల్లా జాయింట్ కలెక్టర్ కు వారు తెలిపారు.ఎమ్.ఎల్.ఎస్ పాయింట్ తనిఖీ సందర్భంలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ టి.శివరాం ప్రసాద్, టెక్నికల్ సహాయ మేనేజర్ ఇబ్రహీం, తణుకు తహసిల్దార్ డి.వి.ఎస్.ఎస్ అశోక్ వర్మ, తదితరులు ఉన్నారు.
నిత్యవసర వస్తువులు ఆగస్టు 30 లోపుగా ఎఫ్.పి షాపులకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలి – జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి
28
Aug