లీడర్ భాస్కర్ న్యూస్ (భీమవరం) బుధవారం మార్కెట్లో వేం చేసియున్న శ్రీవరసిద్ధి వినాయక స్వామివారి ఆలయ ఆధునీకరణ పనులను ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. మొదటి పూజ చేసేటప్పుడు మనందరం కొలిచే భగవంతుడు వినాయకుడేనని అన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు , కమిటీ అధ్యక్షులు పైపూరి బుజ్జి బాబు, కార్యదర్శి నేరెళ్ల కోటేశ్వర రావు, కోశాధికారి కొప్పురావూరి ప్రసన్నాంజనేయులు , గౌరవ సలహాదారు సంగడి బుజ్జి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *