లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు) స్థానిక పురుషుల శాఖా గ్రంథాలయం నందు అభివృద్ధి కమిటీ అధ్యక్షురాలు వావిలాల సరళాదేవి ఆధ్వర్యంలో తెలుగు మాతృభాషా దినోత్సవం నిర్వహించారు. ముందుగా తెలుగు వ్యవహారిక భాషోద్యమ నాయకుడు గిడుగు రామ్మూర్తి నాయుడు చిత్రపటానికి పూలమాల వేశారు.
ఈ సందర్బంగా సరళాదేవి మాట్లాడుతూ గిడుగు రామ్మూర్తి పంతులు తెలుగు మాతృభాషకు ఆయన చేసిన కృషికి గాను ఆయన 162 వ జన్మదినం రోజున మాతృభాషా దినోత్సవంగా జరుపుకుంటున్నామని ఆయన స్పూర్తితో తెలుగు ప్రజల తెలుగును సరళీకరణ విధానంలో నేర్చుకున్నారు అని ఆయన స్పూర్తితో యువత తెలుగును ప్రేమిస్తూ, పరభాషను గౌరవించాలని తెలియపరుస్తూ తెలుగు వారందరికీ తెలుగు మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
గిడుగు రామ్మూర్తి నాయుడు 162వ పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన వావిలాల సరళాదేవి…
29
Aug