లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు) తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో తణుకు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగు భాషా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తెలుగు భాష ఔన్యైత్యానికి కృషి చేసిన ఐదుగురు పండితులను ఘనంగా సత్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో MLA రాధాకృష్ణ మాట్లాడారు. గ్రాంధిక భాషగా ఉన్న తెలుగు భాషను వాడుక భాషగా అమలులోనికి తీసుకుని వచ్చిన మహావ్యక్తి గిడుగు రామ్మూర్తి అని పేర్కొన్నారు. ఆయన జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం తెలుగు భాషా దినోత్సవం గా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. తెలుగు భాషకు ఎంతో ప్రాధాన్యత ఉందని, ప్రపంచవ్యాప్తంగా 220 దేశాల్లో తెలుగువారు ఉండి ఔన్నత్యాన్ని కాపాడుతున్నారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు తెలుగు భాష విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పారని వెల్లడించారు. ఆయన బాటలోని చంద్రబాబు నాయుడు కూడా తెలుగు భాష ప్రాచుర్యానికి కృషి చేస్తున్నారని తెలిపారు. పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం తో పాటు తెలుగు మీడియం కూడా కొనసాగించడం ద్వారా తెలుగు భాష విశిష్టతను చెప్పడానికేనన్నారు. చైనా వంటి దేశాల్లో సైతం మాతృభాషకే ఎక్కువ ప్రాధాన్యమని వివరించారు. తెలుగు భాషను కాపాడతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ కోరారు.
గ్రాంధిక భాషగా ఉన్న తెలుగు భాషను వాడుక భాషగా అమలులోనికి తీసుకుని వచ్చిన మహావ్యక్తి గిడుగు రామ్మూర్తి – MLA ఆరిమిల్లి రాధాకృష్ణ
29
Aug