వనమహోత్సవంలో భాగంగా విద్యార్థులకు మొక్కలు పంపిణి…

లీడర్ భాస్కర్ న్యూస్ (భీమవరం) పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం బేతపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద వన మహోత్సవం మొక్కలు నాటే కార్యక్రమంలో జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు,జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, పంచాయతీ సర్పంచ్ తిరుమల యామిని దేవి బలరామకృష్ణ, టిడిపి రాష్ట్ర కార్యదర్శి కోళ్ళ నాగేశ్వరరావు, ఎన్డీఏ కూటమి నాయకులు, జిల్లా ఉన్నతాధికారులు తదితరులు పాల్గొని విధ్యార్దులతో కలిసి మొక్కలు నాటి మొక్కలు పంచిపెట్టారు..ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెట్లను నరకవద్దు పెంచండి అన్నారు.చెట్లు మన ప్రాణాన్ని కాపాడతాయన్నారు. ఇంటి ముందు వేప చెట్టు ఉంటే ఆ ఇంటిలో ఎవరికి రోగాలు రావన్నారు. చెట్లను పెంచవలసిన బాధ్యత మనందరి మీద ఉందన్నారు. నాగలి, పేపరు, ప్రతిరోజు మనం వినియోగించే ఎన్నో తదితర వస్తువులు మొక్క ద్వారా వచ్చే కలపతోనే తయారవుతాయని గుర్తుంచుకోవాలన్నారు. మనకు ప్రాణాధారమైన వాయువును అందించడంతోపాటు, దైనందిన జీవితంలో కూడా మిళతమై ఉన్నది ఒక్క మొక్క మాత్రమే అని గుర్తించాలన్నారు. ఇటువంటి మొక్కలను నాటకపోతే భవిష్యత్తులో మానవుడి మనుగుడే ప్రశ్నార్థకం అవుతుంది అనడంలో సందేహం లేదన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *