తణుకులో నటసింహం బాలకృష్ణ 50 సంవత్సరాల సినీ ప్రస్థానం సంబరాలు…

లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు) నటసింహ నందమూరి బాలకృష్ణ  సినీ ప్రస్తావానికి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తణుకు MLA ఆరిమిల్లి రాధాకృష్ణ క్యాంప్ కార్యాలయం నందు నందమూరి అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ ని MLA రాధాకృష్ణ కట్ చేసి అభిమానులకు పంచారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సినీ హీరోగా బాలకృష్ణ ఎన్నో జానపద,పౌరాణిక సినిమాలతో పాటు సందేశాత్మక చిత్రాల్లో నటించి ప్రజలను మెప్పించారన్నారు. మరో వైపు రాజకీయాల ద్వారా ప్రజలకు సేవా కార్యక్రమాలు అందజేస్తున్నారని అన్నారు. ఆయన పిలుపుతో అభిమానులు కూడా ఎన్నో ప్రజాసేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ఇలానే బాలకృష్ణ మరిన్ని సినిమాలు నటించి అభిమానులను అలరించాలని ఆకాంక్షించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *