లీడర్ భాస్కర్ న్యూస్ (ఉండి)రోజు రోజుకు ఆకాశాన్నంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో పేద, మధ్య తరగతి ప్రజానీకం జీవనం కడు దుర్భరంగా మారుతుందని తక్షణమే పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని సీపీఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్ చేశారు.సీపీఐ జాతీయ సమితి ఇచ్చిన దేశవ్యాపిత పిలుపులో భాగంగా ఆదివారం ఉండిలో అధికధరలకు వ్యతిరేకంగా, రేషన్ కార్డుల మంజూరు కోరుతూ విస్తృత ప్రచారం నిర్వహించి ఉండి సెంటర్లో ధర్నా నిర్వహించారు.ఈసందర్భంగా భీమారావు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో అన్ని నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తామని చెప్పి గద్దె నెక్కి పదేళ్ళు గడుస్తున్నా ఇప్పటికీ ధరలు నియంత్రించక పోవడం మోడీ అవకాశ వాద రాజకీయాలకు అద్దం పడుతుందన్నారు.ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా 14 రకాల నిత్యావసర వస్తువులను అందించవలసివుండగా కేవలం బియ్యం మాత్రమే పంపిణీ చేస్తూ ప్రజా పంపిణీ వ్యవస్థను ఈ పదేళ్లలో పూర్తిగా నీరు గార్చారన్నారు.అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయాలని,14 రకాల నిత్యావసరాలు పంపిణీ చేయాలని భీమారావు డిమాండ్ చేశారు.ధర్నాకు సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు కలిశెట్టి వెంకట్రావు, జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.సీతారాం ప్రసాద్, జిల్లా సమితి సభ్యులు సనపల శ్రీనివాస్,కోన గొల్లయ్య, వ్యవసాయ కార్మిక సంఘం ఉండి మండల కార్యదర్శి తమరాని శ్రీనివాస్, ఎఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు కొడవర్తి రమేష్, దొమ్మేటి నాగరాజు,వీరనపల్లి పెద్దిలు, ఒంటెద్దు వెంకన్న తదితరులు ఆధ్వర్యం వహించారు.
పెరుగుతున్న ధరలతో ప్రజా జీవనం దుర్భరం,అధిక ధరలు తగ్గించాలి, అర్హులైన వారికి రేషన్ కార్డులు మంజూరు చేయాలి… సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు…
01
Sep