వరద బాధితుల సహాయార్థం దాతలు ముందుకు రావాలి – MLA బొలిశెట్టి పిలుపు

లీడర్ భాస్కర్ న్యూస్ (తాడేపల్లిగూడెం) కృష్ణాజిల్లాలోని పలు ప్రాంతాల్లో వరదముంపులో ఉన్న బాధితులను ఆదుకోవడానికి తాడేపల్లిగూడెం లోని దాతలు ముందుకు రావాలని శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తయారుచేసి పంపిణీకి సిద్ధంగా ఉన్న ఆహార పదార్థాలను ఆయన పరిశీలించి విజయవాడకు పంపించారు. ఇంతటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులను ఆయన అభినందించారు. వరదముంపులో ఉన్న వారిని ఆదుకునేందుకు తాను సైతం సిద్ధంగా ఉన్నానని తన వంతు సహకారాన్ని కూడా వరద బాధితులకు అందిస్తున్నట్లుగా తెలిపారు. స్థానిక భారతీయ విద్యా భవన్ ప్రాంగణం నుంచి సుమారు పది వాహనాల్లో ఆహార పోట్లాలను వరద ప్రభావిత ప్రాంతాలకు పంపించారు. ముందు ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను మనం కాపాడుకోవాలని ఎవరు ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశంతో తొలుత ఆహార పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *