తణుకులో డాక్టర్ ముళ్ళపూడి హరిశ్చంద్రప్రసాద్ 13వ వర్ధంతి వేడుకలు…

లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు) డాక్టర్ ముళ్ళపూడి హరిశ్చంద్రప్రసాద్ 13వ వర్ధంతి సందర్భంగా తణుకు పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తణుకు ప్రాంత అభివృద్ధి ప్రధాత వ్యవసాయ రంగాన్ని అనుసంధానం చేస్తూ ఎన్నో పరిశ్రమలు స్థాపించి వేలాది మందికి ఉపాధి కల్పించిన మహనీయుడని, చక్కెర నుండి రాకెట్ ఇందనం వరకు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిన స్ఫూర్తి ప్రధాతగా, విద్య వైద్య రంగాలతో పాటు తణుకు ప్రాంతాన్ని సొంత వనరులు సమకూర్చే విధంగా తణుకు పురపాలక సంఘాన్ని ఆధునికరించడంలో రూపశిల్పిగా డాక్టర్ ముళ్ళపూడి హరిచంద్ర ప్రసాద్ ఎంతో కృషి చేసారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ  అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ,రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి దొమ్మేటి వెంకట సుధాకర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *