వరద బాధితులకు యుద్ధప్రాతి పదికన సహాయక చర్యలు అందజేస్తున్నాం – మంత్రి నారా లోకేష్…

లీడర్ భాస్కర్ న్యూస్ (అమరావతి) విజయవాడ వరద బాధితులకు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయని మంత్రి లోకేష్ అన్నారు. ఆరు హెలికాప్టర్లు ద్వారా ఆహారం, త్రాగునీరు సరఫరా చేస్తున్నారు. వివిధ శాఖల మధ్య సహాయక చర్యల సమన్వయం తానే స్వయంగా చూస్తున్నానన్నారు. బోట్లు చేరుకోలేని ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా ఆహార సరఫరా చేస్తున్నాం. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు విజ్ఞప్తి మేరకు జక్కంపూడి వైఎస్‌ఆర్ కాలనీకి ప్రత్యేక హెలికాప్టర్‌లో 2,500 ఆహార పొట్లాలు చేరవేశాం. విజయవాడ పరిధిలో వరద ముంపునకు గురైన 32 వార్డుల్లో సీనియర్ ఐఏఎస్ అధికారుల పర్యవేక్షణలో సహాయక చర్యలు జోరుగా సాగుతున్నాయి. నా పిలుపుతో తెలుగుదేశం శ్రేణులు కూడా పెద్ద ఎత్తున వరద బాధితులకు సాయం చేస్తున్నారని మంత్రి లోకేష్ వివరించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

#AndhraPradesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *