లీడర్ భాస్కర్ న్యూస్ (భీమవరం)తుఫానులు,వరదలతో సర్వసం కోల్పోయిన వరద బాధితులను ఆదుకునేందుకు విరివిగా విరాళాలిచ్చి సహకరించాలని సీపీఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు కోరారు.సీపీఐ ఇచ్చిన రాష్ట్ర వ్యాపిత పిలుపులో భాగంగా శుక్రవారం భీమవరం పట్టణంలో వరద బాధితుల సహాయార్ధం సీపీఐ ఆధ్వర్యంలో నిధి సేకరణ చేపట్టారు.ఈసందర్భంగా భీమారావు మాట్లాడుతూ బుడమేరు వాగుకు గండ్లుపడి వందేళ్ల కాలంలో కనీవినీ ఎరుగని రీతిలో విజయవాడను వరదలు ముంచెత్తాయన్నారు.వరదల కారణంగా విపరీతంగా ఆస్థి నష్టం,ప్రాణ నష్టం వాటిల్లిందన్నారు.లక్షలాది మంది ప్రజలు సర్వసాన్ని కోల్పోయి కట్టుబట్టలతో దిక్కుతోచని స్థితిలో బాధితులు సహాయం కోసం ఎదురు చూస్తున్నారన్నారు.మానవతా దృక్పథంతో ప్రజలు తమకు తోచిన రీతిలో సహకారం మందించి బాధితులను ఆదుకోవాలని భీమారావు కోరారు.
సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు కలిశెట్టి వెంకట్రావు, జిల్లా కార్యవర్గ సభ్యులు చెల్లబోయిన రంగారావు,ఎం.సీతారాం ప్రసాద్,సికిలే పుష్పకుమారి, జిల్లా సమితి సభ్యులు కోన గొల్లయ్య, కొడవర్తి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
తుఫానులు,వరదలతో సర్వసం కోల్పోయిన వరద బాధితులను ఆదుకునేందుకు విరాళాలిచ్చి సహకరించండి – సీపీఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు
06
Sep