వరద బాధితులకు ఎమ్మెల్యే పితాని ఆపన్న హస్తం…

— పశ్చిమగోదావరి జిల్లా ఎమ్మెల్యే పితాని పిలుపుమేరకు బాధితులకు సహాయం..

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

లీడర్ భాస్కర్ న్యూస్ (ఆచంట)వరదల్లో పూర్తి నిరాశ్రులైన ప్రజలను ఆదుకోవాలని మాజీ మంత్రి ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ పిలుపునిచ్చారు. దాతలు ముందుకు వచ్చారు. వరద బాధితులను ఆదుకునేందుకు ఆపన్న హస్తాన్ని అందించారు. లారీలో కూరగాయలు రెండు మినీ వాహనాల్లో మిగిలిన సరుకులు తరలించారు.రెండు టన్నుల కూరగాయలు 500 కుటుంబాలకు ప్యాకెట్లు చేసి చిన్నారులకు పాలు బిస్కెట్లు, రొట్టెలను వాటర్ బాటిల్స్ బాధితులకు అందజేశారు. దొంగరావిపాలెం చెందిన శ్రీ వెంకటేశ్వర కూరగాయల వర్తక సంఘం అధ్యక్షులు కుడిపూడి నరసింహామూర్తి దాతల సహకారంతో బంగాళాదుంపలు ,పచ్చిమిర్చి ,అల్లం, టమోటా, క్యారెట్ ,వాటర్ బాటిల్స్, పాలుసమకూర్చారు. .విజయవాడ 44 వార్డు లేబర్ కాలనీ భవానిపురం 500 కుటుంబాలకు నిత్యవసర వస్తువులు తీసుకుని ఎమ్మెల్యే తనయుడు పితాని వెంకట్ కూటమి నాయకులు కలిసి భవానిపురం వరద బాధితులకు పంపిణీ చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *