లీడర్ భాస్కర్ న్యూస్ (విజయవాడ) వరద బాధితులకు అండగా నిలుస్తూ సింగపూర్ లో నివసించే ప్రవాస తెలుగు వారు బొబ్బారాజా చౌదరి, సతీష్ పారేపల్లి, రాధిక ప్రసాద్ ఆధ్వర్యంలో వరద బాధితుల కోసం సీఎం చంద్రబాబు నాయుడుని విజయవాడ కలెక్టరేట్ లో సోమవారం తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ తో కలసి 17.5 లక్షల రూపాయలు చెక్కును అందించారు. ఈ సందర్భంగా విజయవాడ నగరాన్ని వరదలు తీవ్రంగా ప్రభావితంతో ప్రకృతి విపత్తు అనేక కుటుంబాల జీవితాలను కుదిపేసిన ఈ క్లిష్ట సమయంలో, విజయవాడ ప్రజలకు అండగా నిలబడటంలో సింగపూర్లో నివసించే తెలుగు ప్రజలు ముందుండటం మనకు గర్వకారణని అన్నారు. ఈ ఆర్థిక సహాయంలో, తమ దాతృత్వంతో సహకరించిన ప్రతి ఒక్కరికీ రాజా చౌదరి , సతీష్ పారేపల్లి, రాధిక ప్రసాద్ లకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున ధన్యవాదాలు తెలిపారు. అంతకు ముందు విజయవాడ 32 వ డివిజన్ అయోధ్య నగర్ నందు వరద ప్రభావిత ప్రాంతాలలో జరుగుతున్న శానిటేషన్ పనులను శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ స్వయంగా పరిశీలించి అనంతరం వరద నష్టంపై జరుగుతున్న ఎన్యూమరేషన్ నమోదు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
మానవీయతను చాటిన సింగపూర్ ప్రవాస తెలుగు వాసులు – తణుకు ఎమ్యెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ
09
Sep