లీడర్ భాస్కర్ న్యూస్ (భీమవరం) జిల్లాలో గత నెల రోజుల నుండి ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ఎటువంటి అంటూ వ్యాధులు ప్రబలకుండా మెరుగైన పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. జిల్లాలోని అన్ని తాగునీటి వనరులను క్లోరినేషన్ చేయడంతో పాటు, సూపర్ క్లోరినేషన్ కాన్సెప్ట్‌ను అవలంబించాలన్నారు. అన్ని కార్యకలాపాలు పిఆర్-వన్ యాప్‌లో అప్లోడ్ చేయాలన్నారు. అంటు వ్యాధులు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలన్నారు. లోతట్టు ప్రాంతాలలో నిలిచిపోయిన నీటిని తొలగించాలన్నారు. ఎక్కడ చెత్త పేరుకుపోకుండా చెత్త కుప్పలను వెంటనే తొలగించాలన్నారు. డ్రెయిన్లు యుద్ధ ప్రాతిపదికన శుభ్రపరిచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. దోమల నివారణకు అన్ని ప్రాంతాల్లో ఫాగింగ్ చేయడంతో పాటు ఆయిల్ బాల్స్ కూడా వినియోగించాలన్నారు. అన్ని ఎస్.డబ్ల్యూ.పి.సి షెడ్లను అక్టోబర్ 2 నాటికి అందుబాటులో తీసుకోవాలని సూచించారు. నీటి వనరులను కలుషితం కాకుండా చూడాలన్నారు.
జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహించాలి – జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
09
Sep