లీడర్ భాస్కర్ న్యూస్ (పిఠాపురం) రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం మధ్యాహ్నం నుంచి కాకినాడ జిల్లాలోని ఏలేరు రిజర్వాయర్ వరద ప్రాంతాల్లో పర్యటించారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులోని జగనన్న కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఏలేరు రిజర్వాయర్ పరిస్థితిపై ఎప్పటికప్పుడు కాకినాడ కలెక్టర్ శ్రీ షణ్మోహన్ సగిలితో మాట్లాడుతూనే ఉన్నానన్నారు. ముంపు ప్రభావిత ప్రాంతాలలో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశానని చెప్పారు.సుద్ధగడ్డ వాగు సమస్యకు ఇక్కడి ఎమ్మెల్యేగా పూర్తి స్థాయి పరిష్కారం చూపుతానని తెలిపారు.గత ప్రభుత్వం జగనన్న కాలనీలు పేరుతో చేసిన తప్పులకు ప్రజలు నష్టపోయారు. ఆ తప్పులను కూటమి ప్రభుత్వంలో మేము సరి చేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు.గొల్లప్రోలులోని జగనన్న కాలనీ స్థలాన్ని లోతట్టు ప్రాంతంలో కొనేశారు. రూ. 30 లక్షల ఎకరా భూమి మార్కెట్ ధరను రూ. 60 లక్షలు చెల్లించి కొన్నారని విమర్శించారు.ఏలేరు రిజర్వాయర్ వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షించి తగు సూచనలు ఇస్తున్నాం. ప్రజల బాధలు వెతలు స్వయంగా పరిశీలించేందుకే ఈ రోజు ఆరోగ్యం సరిగా లేకపోయినా క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చానని పవన్ కళ్యాణ్ తెలియజేశారు.
#AndhrapradeshFloods