లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు) విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు దాతల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందని మానవత్వంతో విరాళాలు వెల్లువెత్తుతున్నాయని తణుకు శాసన సభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 17,50,000 సీఎం రిలీఫ్ ఫండ్ కి అందించడం జరిగిందన్నారు. తణుకు క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని పలువురు పారిశ్రామికవేత్తలు, డాక్టర్లు, వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు, సామాన్యులు ప్రతీ ఒక్కరూ ముందుకు వచ్చి పెద్ద మొత్తంలో చెక్ ల రూపంలో విరాళాలు అందిస్తున్నారని అన్నారు. ఇటువంటి విపత్కర సమయంలో మానవత్వం చాటుకోవడం అభినందనీయమని కొనియాడారు. మరోవైపు విజయవాడ వరదలు మానవ తప్పిదం అంటూ జగన్ చేస్తున్న వ్యాఖ్యలపై ఖండించారు. వరదలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే జగన్ మోహన్ రెడ్డి రాజకీయం చేస్తున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా బాధ్యతా రాహిత్యంగా జగన్ మాట్లాడుతున్నారని., ప్రకాశం బ్యారేజీ ను కూల్చేందుకు వైసిపి నాయకులు భారీ కుట్రకు తెరలేపారని మాజీ ఎంపీ నందిగం సురేష్ కనుసన్నల్లో ఐదు బోట్లతో బ్యారేజీపై దాడికి యత్నం చేయడం సిగ్గుచేటని కేవలం 11 సీట్లకే పరిమితం చేసి ప్రజలు బుద్ధి చెప్పినా వారి తీరులో మార్పు రాలేదని అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు, అన్ని వర్గాల ప్రజలు వరద బాధితులకు సహాయం చేస్తుంటే వైసీపీ నేతలు మాత్రం రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. వరద బాధితులకు సాయం చేసేందుకు తణుకు నియోజకవర్గం నుంచి అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావడం అభినందనీయని హర్షం వ్యక్తం చేశారు.
వరద బాధితులను ఆదుకునేందుకు వస్తున్న అనూహ్య స్పందన – తణుకు MLA ఆరిమిల్లి రాధాకృష్ణ…
13
Sep