పెనుగొండ లైన్స్ క్లబ్ అధ్యక్షులుగా జక్కం విజయ్..

* పెనుగొండ లైన్స్ క్లబ్ నూతన కార్యవర్గం ఎంపిక

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

లీడర్ భాస్కర్ న్యూస్ (పెనుగొండ) పెనుగొండ మండలం లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం మహోత్సవన్ని పెనుగొండ జుపిటర్ మాస్టర్ మైండ్స్ స్కూల్ ఆవరణలో నిర్వహించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా జక్కం విజయ్, సెక్రటరీగా గుమ్మడి చంటి, ట్రెజరర్ గా మండా ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేశారు.ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు జక్కం విజయ్ మాట్లాడుతూ ఇప్పటివరకు పెనుగొండలో లైన్స్ క్లబ్ కంటి ఆసుపత్రి లేని కారణంగా నా సొంత ఇంటిని నేను అధ్యక్షులుగా ఉన్నంతవరకు ఉచితంగా లయన్స్ క్లబ్ కంటి ఆసుపత్రిగా సేవలు అందించడానికి ఉపయోగిస్తానని తెలియజేశారు. అలాగే సేవా దృక్పథంతో అనేక సేవలు ప్రజలకు అందించడంలో ముందు ఉంటానని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆచంట MLA  పితాని సత్యనారాయణ తనయుడు వెంకట్ విచ్చేసి మాట్లాడుతూ ప్రతీ ఒక్కరిలోనే ఇలాంటి సేవా దృక్పథంతో ముందుకు నడవాలని ఇలాంటి మంచి సేవ కార్యక్రమాలు చేస్తే ప్రతి ఒక్కరూ హర్షించడంతోపాటు ఆశీర్వచనాలు కూడా అందిస్తారని ఆయన అన్నారు. అలాగే కొత్త కార్యవర్గం సభ్యులు లయన్స్ క్లబ్ ద్వారా ప్రజలకు అనేక సేవలు చేస్తారని నూతన కార్యవర్గం మీద నమ్మకం ఉందని కొనియాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *