పాలకొల్లులో డయాలసిస్ సెంటర్ ను ఏర్పాటు చేయమని కోరిన మంత్రి నిమ్మల…

లీడర్ భాస్కర్ న్యూస్ (విజయవాడ) అమరావతి సచివాలయంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ను మంత్రి నిమ్మల రామానాయుడు కలిశారు. ఈ సందర్భంగా పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని ఆయనను మంత్రి రామానాయుడు కోరారు. గత టిడిపి ప్రభుత్వంలో 50 పడకల ఆసుపత్రిని వందల పడకల స్థాయికి పెంచి నూతన భవన నిర్మాణానికి రూ 12.60 కోట్లు మంజూరు జరిగిందని, ఆ పనులు వైసీపీ ప్రభుత్వంలో సవ్యంగా జరగక ఇష్టానుసారంగా చేశారని మళ్లీ ఈ పనులను రోగులు ప్రజలకు ఉపయోగపడేలా చేయిస్తున్నట్లు వివరించారు. ఈ భవనానికి రెండు అంతస్తు నిర్మాణ పనులకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని మంత్రి రామానాయుడు కోరారు. ఆసుపత్రి పేరును స్థల దాత ఇమ్మిడి సత్యనారాయణ ప్రభుత్వ ఆసుపత్రిగా పేరు మార్చేలా త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని వైద్యశాఖ మంత్రిని మంత్రి రామానాయుడు కోరారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *