లీడర్ భాస్కర్ న్యూస్ (భీమవరం)కోపరేటివ్ సహకార సంఘాలు విజయవాడ వరద బాధితులకు రూ.6,05,053/- లు విరాళం.శాఖ పేరును సార్ధకం చేస్తూ విజయవాడ వరద బాధితులకు సహకారం అందించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. స్థానిక కలెక్టరేట్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణిని జిల్లా, డివిజన్ సహకార శాఖ అధికారులు, సహాయ రిజిస్టార్లు కలిసి రూ.6,05,053/- లు డిమాండ్ డ్రాఫ్ట్ ను విజయవాడ వరద బాధితుల సహాయం నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, నరసాపురం సబ్ డివిజన్లకు చెందిన 110 సహకార సంఘాలు సెక్రటరీలు, సిబ్బంది కలిసి ఇంత పెద్ద మొత్తంలో విరాళం అందజేయడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ఆపద సమయంలో ఆపన్న హస్తం అందించడానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి జిల్లా కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు.
కోపరేటివ్ సహకార సంఘాలు విరాళం ఇవ్వడం అభినందనీయం – కలెక్టర్ చదలవాడ ఉషారాణి…
20
Sep