* ఇబ్బందుల్లో ఉన్న పేదవారికి సాయం చేయాలని యువతకు పిలుపు
లీడర్ భాస్కర్ న్యూస్(తాడేపల్లిగూడెం) పట్టణంలో మద్దాల నరసింహారావు కుమార్తె మోక్షశ్రీ పుట్టినరోజు సందర్భంగా గురజాడ అన్నపూర్ణ, తగ్గేళ్ల అనంతలక్ష్మి అను పేద మహిళలకు (10,000) పదివేల రూపాయలు ఆర్థిక సహాయం గూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదగా అందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మద్దాల నరసింహారావు ను అభినందించారు. ఎమ్మెల్యే బొలిశెట్టి మాట్లాడుతూ పేదవారు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారికి సహాయం చేయాలని యువతకు పిలుపునిచ్చారు.మనం బ్రతుకుతూనే మన చుట్టూ ఉన్నవారిని బ్రతికించడమే నిజమైన మానవత్వం అని అన్నారు.