లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు) కాళ్ళ మండలం ఏలూరుపాడు గ్రామంలో ఉండి టిడిపి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఫ్లెక్సీని కొన్ని వందల మంది చూస్తూ ఉండగా చాలా అవహేళనగా చించి వేయడం జరిగింది. దానిని నిరసిస్తూ దళిత సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రంవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన ధర్నాలు మరియు ఎమ్మెల్యే ఇంటిని ముట్టడి కార్యక్రమం చేపట్టారు.టిడిపి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజుపై వెంటనే ఎస్సీఎస్టీ,అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా అతడు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసి, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఇంతవరకు స్పందించక పోవడంతో ఈరోజు ఏలూరుపాడు గ్రామంలో కాళ్ళ పోలీస్ స్టేషన్ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆల్ ఇండియా ఫూలే అంబేడ్కర్ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు మరియు దళిత ఐక్యవేదిక అధ్యక్షులు న్యాయవాది పొట్ల సురేష్ ఈరోజు ఉదయం పోలీసులు ఇంటికి వచ్చి హౌస్ అరెస్ట్ చేసి నిర్బంధించారు. ఎవరైతే తప్పు చేశారో వారి మీద కేసు పెట్టి అరెస్టు చేయకుండా జిల్లా వ్యాప్తంగా ఉద్యమకారుల మీద పోలీసులు అరెస్టులు సరికాదని పొట్ల సురేష్ వాపోయారు . ఈ సందర్భంగా పలువురు నాయకులు అరెస్టుకు నిరసనగా సంఘీభావం భావం తెలియజేశారు.
అక్రమ అరెస్టులతో ఉద్యమం ఆపలేరు – పొట్ల సురేష్
08
Oct