దసరా పండుగ మన జీవితాల్లో కొత్త వెలుగు నింపాలి – లీడర్ భాస్కర్

లీడర్ భాస్కర్ న్యూస్ :- విజయదశమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు శుభాకాంక్షలు. ప్రజలంతా సుఖ శాంతులతో వర్థిల్లేలా చూడాలని ఆ కనకదుర్గమ్మ తల్లిని వేడుకుంటున్నాను. చెడు పై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిర్వహించుకునే దసరా పండుగ మన జీవితాల్లో కొత్త వెలుగు నింపాలని ఆకాంక్షిస్తున్నాను. దుష్ట సంహారం తర్వాత శాంతి, సౌభ్రాతృత్వంతో అందరూ కలిసిమెలిసి జీవించాలన్నదే దసరా పండుగ సందేశం. ఇదే స్ఫూర్తితో శాంతియుత, అభివృద్ధికారక సమాజం కోసం కృషి చేద్దాం. శక్తి ఆరాధనకు ప్రాధాన్యతనిచ్చే ఈ పండుగ దినాల్లో అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని తొమ్మిది అవతారాల్లో దర్శించుకున్నాం. మరొక్క మారు అందరికి మనస్ఫూర్తిగా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ… పాఠకులకు, ప్రకటకర్తలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ – మీ లీడర్ భాస్కర్            ( జర్నలిస్ట్ )

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *