అత్తిలిలో గ్రామ దర్శిని ప్రారంభించిన తణుకు MLA ఆరిమిల్లి రాధాకృష్ణ…

లీడర్ భాస్కర్ న్యూస్ (అత్తిలి) తణుకు నియోజకవర్గంలోని అత్తిలి మండలం K. సముద్ర గట్టు వద్ద గ్రామదర్శిని & పల్లె పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు.గ్రామంలో ఇంటింటికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం హయాంలో గ్రామాల్లో అభివృద్ధిపై నిర్లక్ష్యం అయిందన్నారు.గ్రామదర్శిని- పల్లె పండుగ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో అభివృద్ధికి ప్రణాళికలు చేపట్టిన కూటమి ప్రభుత్వం అని అన్నారు.నియోజవర్గంలో అన్ని గ్రామాల్లోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కారం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తారన్నారు.సిసి రోడ్లు, డ్రైనేజీలు, మినీ గోకులం నిర్మాణాలకు చర్యలు. సిసి రోడ్లు డ్రైనేజీలు నిర్మాణానికి రూ.7.50 కోట్లు, మినీ గోకులం నిర్మాణానికి  రూ. 1.50 కోట్లు కేటాయింపు జరిగిందన్నారు.ఆగస్టు 23న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన గ్రామ సభల ద్వారా తీర్మానాలు చేసిన పనులు జనవరి లోపు పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.కె.సముద్రపు గట్టు గ్రామంలో ఆదాయ వనరుగా ఉన్న చెరువులను అభివృద్ధి చేసేందుకు చర్యలు, గ్రామాల్లో అభివృద్ధికి పెద్దపీట వేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సిబ్బంది, తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *