కూటమి ప్రభుత్వంలో గ్రామాలలో మరింత అభివృద్ధి – తణుకు ఎం‌ఎల్‌ఏ ఆరిమిల్లి రాధాకృష్ణ…

లీడర్ భాస్కర్ న్యూస్ (ఇరగవరం) గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా తణుకు శాసన సభ్యులు  ఆరిమిల్లి రాధాకృష్ణ  ఇరగవరం మండలం కె కుముదవల్లి గ్రామంలో పర్యటించారు.. ఈ సంధర్భంగా గ్రామంలో ప్రతీ గడపకు వెళ్ళి ప్రజల సమస్యలు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా గ్రామంలో డ్రైనేజి, రోడ్ల సమస్యలు ఉందని గ్రామస్తులు ఎం‌ఎల్‌ఏ రాధాకృష్ణకి తెలిపారు. వాటి పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు తెలియజేసి రానున్న రోజుల్లో వాటిపై చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. గ్రామదర్శిని కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు నుండి స్పందన వస్తుందని వారి సమస్యలు, గ్రామ సమస్యలు తెలియజేస్తున్నారని ఆయన అన్నారు. గత వైసీపీ పాలనలో గ్రామాల అభివృద్ధిని పూర్తిగా నిర్వీర్యం చేసిన పరిస్థితిలో నియోజకవర్గంలో ప్రతీ గ్రామంలో అనేక సమస్యలు నెలకొన్నాయని అన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రతి సమస్యకు పరిష్కారం చూపే విధంగా పాలన సాగుతుందని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న “ పల్లె పండుగ “ కార్యక్రమంలో భాగంగా కె కుముదవల్లి గ్రామంలో MGNREGS నిధులతో రూ. 10 లక్షలతో నూతన డ్రైనేజి లకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *