లీడర్ భాస్కర్ న్యూస్ (అమరావతి) ఉచిత ఇసుక విషయంలో కూటమి MLAలు జోక్యం చేసుకుంటే ఎవర్నీ వదలబోమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ‘ఇందులో తన, మన అనేవి ఉండవు. ఇసుక ఉచితంగానే తీసుకెళ్లాలి. ఎవరైనా ఎడ్ల బండి తీసుకొచ్చి ఇసుక తీసుకెళ్లవచ్చు. వారిపై కేసులు పెడితే అధికారులను సస్పెండ్ చేస్తాం. దీనిలో ఎవరి పెత్తనాన్నీ సహించం. ఎవరి ఊరిలో వాళ్లకు ఇసుక తీసుకెళ్లే స్వేచ్ఛ ఉంటుంది. ఇందులో ఎవరి పెత్తనం వద్దు’ అని ఆయన స్పష్టం చేశారు.
ఉచితంగా ఇసుక తీసుకెళ్లొచ్చు.. అడ్డుకోవద్దు – సీఎం చంద్రబాబు
17
Oct