లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు) రాష్ట్రంలో పరిపాలన స్తంభించిందని పాలన గాలికొదిలేసారన్నారని, దోచుకో.. దాచుకో.. పంచుకో…అనే విధంగా ఉంది కూటమి నేతల పని ఉందని రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరావు మండిపడ్డారు. మద్యం షాపుల్లో పర్శంటేజ్ ప్రతీ పనికి కమిషన్లు ద్యాసలోనే ఉన్నారని,పాలన గాలికొదిలేశారు అనటానికి విజయనగరం జిల్లా గుర్ల సంఘటన నిదర్శనమన్నారు.అతిసారా వ్యాధితో 16 మంది చనిపోతే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని,చనిపోయింది ఎంతమందో కూడా ఒకరి మాటలకు ఒకరికి పొంతన లేదన్నారు.ఎప్పుడు ఎవర్నిఅరెస్టు చేయిద్దామా అంటూ కక్షపూరిత పాలనా సాగిస్తున్నారని,రాష్ట్రమంతా కూడా పారిశుద్యం అటకెక్కించారని విమర్శించారు.ఆరోగ్యశ్రీని కూడా గాలికొదిలేశారు ఆసుపత్రిలో మందులు కూడా ఉండటంలేదని,మనిషి ప్రాణమంటే కూటమి ప్రభుత్వానికి లెక్కలేదన్నారు.పారిశుద్యం లోపంతోనే అతి సార ప్రబలి గుర్లలో 16మంది చనిపోయారన్నారు.ఉచిత ఇసుక పేరుతొ గందరగోళం పరిస్థితి తెచ్చారని,భవననిర్మాణ కార్మికులు పనులు లేక అల్లాడిపోతున్నారన్నారు.ఇసుక అందక అనేక చోట్ల ధర్నాలు కూడా చేస్తున్నారని,హామీలు, పథకాలు గాలికొదిలేశారని,సంపద సృష్టించటమంటే ఇదేనా అని ప్రశ్నించారు.కక్షలు ,కార్పణ్యాలు ,రేపులు ,హత్యలు ఇదేనా సంపద సృష్టించటం అని కూటమి ప్రభుత్వంపై రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మండి పడ్డారు.
కూటమి ప్రభుత్వం తీరుపై మండిపడ్డ మాజీ మంత్రి కారుమూరి…
22
Oct