లీడర్ భాస్కర్ న్యూస్ (భీమవరం)జిల్లాలో అధ్వాన్న స్థితికి చేరుకున్న రోడ్లు నిర్మాణం తక్షణమే చేపట్టి ప్రజల ఇబ్బందులు తొలగించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు కోరారు.సోమవారం భీమవరం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణికు వినతిపత్రం సమర్పించారు.ఈసందర్భంగా భీమారావు మాట్లాడుతూ భీమవరం కేంద్రంగా పశ్చిమ గోదావరి జిల్లా ఆవిర్భావం జరిగి సుమారు మూడు సంవత్సరాలు కావొస్తున్న జిల్లా కేంద్రం భీమవరంకు చేరుకునే రోడ్లు నిర్మాణం చేయకపోవడందురదృష్టకరమన్నారు. ఆకివీడు, నాగిడిపాలెం, గణపవరం,పిప్పర,యండగండి, వీరవాసరం, తణుకు తదితర ప్రాంతాల నుంచి భీమవరం చేరుకునే రోడ్లన్నీ తీవ్ర అధ్వాన్న స్థితికి చేరుకుని ప్రమాదాలకు నిలయాలుగా మారాయన్నారు.రోడ్లపై ఏర్పడిన పెద్ద పెద్ద గోతుల్లో వాహనాలు తిరగబడి తీవ్ర ప్రమాదాలకు గురై ప్రయాణీకులు హాస్పిటల్స్ పాలై తీవ్ర అంగ వైకల్యాలకు లేదా కొన్ని సందర్భాల్లో మృత్యువాతకు గురవుతున్నారన్నారు.రోడ్ల దుస్థితి నిరసిస్తూ రోడ్లు నిర్మాణం కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో ఈనెల 22, 23 తేదీల్లో భీమవరం ప్రకాశం చౌక్ వద్ద 32 గంటల నిరసన దీక్షలు కూడా నిర్వహించడం జరిగిందని భీమా రావు కలెక్టర్ నాగరాణి దృష్టికి తెచ్చారు.ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు గమనంలోకి తీసుకుని తక్షణమే పూర్తి స్థాయిలో రోడ్లు నిర్మాణం చేపట్టాలని భీమారావు కోరారు.