కూటమి ప్రభుత్వం మునిసిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలి – CITU జిల్లా కార్యదర్శి పీవీ. ప్రతాప్…

లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు) కూటమి ప్రభుత్వం మునిసిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని CITU జిల్లా కార్యదర్శి పీవీ. ప్రతాప్ డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక కార్యాలయం వద్ద ఏపీ మునిసిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (CITU) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మహా ధర్నా జరిగింది. పట్టణ విస్తరణ కనుగుణంగా మునిసిపల్ కార్మికులు సంఖ్య పెంచాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు ఇంజనీరింగ్, క్లాప్ కార్మికులకు రూ. 24500/-ఇవ్వాలని, చట్టప్రకారం ఉన్న సెలవలు ఇవ్వాలని, పనిముట్లు, రక్షణ పరికరాలు ఇవ్వాలని,సంక్షేమ పథకాలు అమలు చేయాలని, PF, ESI లలో సమస్యలు తొలగించాలని,వాహనాలు రిపేర్లు చేయాలని, విజయవాడ వరదలు టైమ్ లో పని చేసిన కార్మికులకు ఒక నెల వేతనాన్ని బోనస్ గా ఇవ్వాలని,కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, క్లాప్ డ్రైవర్లు వేతన బాకీలు వెంటనే ఇవ్వాలని పెద్దతున నినాదాలు చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *