లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు)తణుకు సంత మార్కెట్లో మద్యం విక్రయాలపై ఎక్సైజ్, పోలీసు అధికారులు స్పందించారు. సంత మార్కెట్లో మద్యం విక్రయాలు జరుగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పరారైన విక్రేతలు… ఫోటోలు, వీడియోలు ఆధారంగా గుర్తించి అరెస్టు చేసిన పోలీసులు.ఎక్సైజ్ సీఐ మణికంఠ రెడ్డి, పట్టణ ఎస్ఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ముగ్గురు అరెస్టు చేసినట్టు తెలిపారు.తణుకు పట్టణానికి చెందిన షేక్ మున్న, కొప్పిశెట్టి శివశంకర్, కొల్లి సుకన్యలుగా గుర్తించారు.నిందితుల వద్ద రూ. 7800 విలువైన 60 మద్యం బాటిళ్లు స్వాధీనం తీసుకున్నట్టు ఎక్సైజ్ సీఐ మణికంఠ రెడ్డి తెలిపారు.
సంత మార్కెట్ లో మద్యం బహిరంగ విక్రయం… ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీస్ లు …
28
Oct