లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు) కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏవైతే హామీలు ఇచ్చారో ఇచ్చిన హామీలు ప్రకారం ఒక్కొక్కటిగా నేరవేరుస్తున్నామని తణుకు MLA ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. సూపర్ సిక్స్ లో భాగంగా “దీపం పథకం” ద్వారా గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు.తణుకు నియోజకవర్గంలో శుక్రవారం ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించడం జరిగిందని అందులో భాగంగా పధకం ద్వారా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ పథకం ద్వారా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారందరూ లబ్ధి పొందుతారు అని అన్నారు.ముఖ్యంగా తణుకు నియోజకవర్గంలో సుమారు 88,000 తెల్లకార్డులు ఉంటే దానిలో ఈ పథకం ద్వారా 68,705 మంది లబ్ధి పొందుతారని అని, మిగిలిన వారంతా వారి యొక్క బ్యాంకు బుక్ ను కేవైసీ బ్యాంకు లింకు, ఆధార్ లింకు, ఫోన్ లింకు, చేసుకోవాలని అన్నారు. చేసుకున్న లబ్ధిదారులు అందరికీ కూడా ఈ ఉచిత గ్యాస్ పథకం వర్తిస్తుందని అన్నారు.అందులో భాగంగా ఈరోజు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మార్చి వరకు ఒక గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతుందని,అలాగే 25 – 26 సంవత్సరంలో ప్రతీ నాలుగు నెలలకు ఒక గ్యాస్ బండ చొప్పున 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరుగుతుందన్నారు.
ఉచిత గ్యాస్ పంపిణి లాంచనంగా ప్రారంభించిన తణుకు MLA ఆరిమిల్లి రాధాకృష్ణ…
01
Nov