లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు) టిడిపి అధికారంలోకి వస్తే ఇంటింటికి పెన్షన్ వెళ్ళదని తప్పుడు ప్రచారం చేశారని తణుకు MLA ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రతిపక్ష పార్టీపై మండిపడ్డారు.ఉదయం 6.00 గంటలకే నుంచి తొలిరోజే 98% పెన్షన్లు పూర్తి చేసేలా పనిచేశామన్నారు.ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే వారికి పెన్షన్ అందజేస్తామని చెప్పారు.తణుకు పట్టణం 7వ వార్డులో , ఇరగవరం మండలం ఈస్ట్ విపర్రు, తణుకు మండలం మహాలక్ష్మి చెరువు గ్రామాల్లో స్వయంగా వెళ్లి పెన్షన్ సొమ్ము ఎమ్మెల్యే రాధాకృష్ణ పంపిణి చేశారు.తణుకు నియోజవర్గంలో 15 కోట్ల 16 లక్షల రూపాయల సొమ్మును 36,618 మంది లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే రాధాకృష్ణ తెలిపారు.
తణుకులో తొలిరోజు 98%పింఛన్లు పంపిణి పూర్తి చేశాం – MLA ఆరిమిల్లి రాధాకృష్ణ
01
Nov