దళిత యువకుడి హత్యపై అసలు దోషులకు శిక్ష పడాలి – మాజీ మంత్రి కారుమూరి

లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు)తణుకు బాయ్స్ హైస్కూల్ లో జరిగిన దళిత యువకుడి హత్యపై నిజాలను నిగ్గు తేల్చా లని, అసలు దోషులను శిక్షించాలంటూ డీస్పీ, సీఐ,ఎస్సై లతో మాట్లాడటం జరిగిందని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరావు అన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఇటువంటి హత్యలు జరుగుతున్నాయని, గతంలో కూడా ఇదే మాదిరి జరిగిన సంఘటనలు ఉన్నాయన్నారు. ప్రజలకు సంక్షేమ పధకాలు ఎలా అందించాలి, ఇంకేమి ఇవ్వాలి అనే దానిపై జగన్ ప్రభుత్వం నిరంతరం ఆలోచించి వాలంటీర్లు ద్వారా సేవలు అందించడం జరిగితే, టీడీపీ ప్రభుత్వం మాత్రం ప్రజలకు ఎలా ఎగగొట్టాలి అనే దానిపై సాకులు చూపిస్తారని విమర్శించారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా సూపర్ సిక్స్ పధకాలను ఎంతో గొప్పగా ప్రకటించిన టీడీపీ ఇప్పుడు ప్రజలకు అందించడంలో విఫలం అయ్యిందన్నారు.గత ప్రభుత్వం హయాంలో ప్రజలకు అందించిన పధకాలకు టీడీపీ తూట్లు పొడిచిందన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *