లీడర్ భాస్కర్ న్యూస్ (విజయవాడ)ప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్‌కల్యాణ్ మరో 12 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. దీని రిజిస్ట్రేషన్‌ను ఆయన తరఫున రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ ఛైర్మన్ తోట సుధీర్ మంగళవారం పూర్తి చేశారు. త్వరలోనే ఈ స్థలంలో ఇల్లు, క్యాంపు కార్యాలయం నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ముందు పిఠాపురంలో ఇల్లు కట్టుకుంటానని ఇక్కడి ప్రజలకు పవన్ మాటిచ్చారు.