లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు)తణుకు పరిసర ప్రాంతాల్లో బైక్ దొంగలు రెచ్చిపోతున్నారు. ఇటీవల కాలంలో ఇంటి ఎదురుగా పార్కింగ్ చేసిన వాహనాలను ఎత్తుకెళ్లిపోతున్నారు. తాజాగా తణుకు మండలం పైడిపర్రు డ్రైవర్స్ కాలనీలో తోట శివసాయికి చెందిన మోటార్ సైకిల్ గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుపోయారు. ఆరుగురు యువకులు మూడు మోటార్ సైకిళ్లపై వచ్చి ఇంటి ముందు పార్కింగ్ చేసిన బైక్ ఎత్తుకెళ్లారు. ఈ దృశ్యాలు సమీపంలో సీసీ కెమెరాలో నమోదయ్యాయి.
తణుకులో బైక్ ఎత్తుకెళ్లిన దొంగలు..!
08
Nov