లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు) ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ఎస్.మణికంఠ రెడ్డి ఆధ్వర్యంలో తణుకు ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాబా హోటల్స్ ను సోమవారం తనిఖీ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఇరగవరం మండలం కంతేరు గ్రామంలో దాబా హోటల్లో మద్యం విక్రయిస్తున్న వణువుల పద్మరాజు అనే వ్యక్తినీ అరెస్టు చేసి అతని వద్ద నుండి 5 మద్యం సీసాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ దాడులలో ఎస్సై ఆర్ .మధుబాబు మరియు హెడ్ కానిస్టేబుల్స్ కె. శ్రీ నివాస్, ఎన్.అప్పలస్వామి, కానిస్టేబుల్ జి.గంగాధర్ పాల్గొన్నారు.దాబా రెస్టారెంట్లలో మద్యం విక్రయాలు జరపడం మరియు మద్యం సేవించుటకు అనుమతించడం వంటివి చేస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా తణుకు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్. మణికంఠ రెడ్డి తెలిపారు.
డాబా హోటల్స్ లో మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు – తణుకు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్. మణికంఠ రెడ్డి
10
Dec