ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి – ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్

లీడర్ భాస్కర్ న్యూస్(తాడేపల్లిగూడెం)ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యాలయం నందు సోమవారం పలు సమస్యలతో కార్యాలయానికి వచ్చిన ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని త్వరత్వరతిన పూర్తయ్యే విధంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా వివరించారు. త్వరలోనే అర్హులైన వారికి ప్రభుత్వం నుంచి ఇళ్ల స్థలాలు, టిడ్కో ఇళ్లు వచ్చేలా కృషి చేస్తానని తెలియజేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *