తణుకులో గోవధ పరిశ్రమ మూసివేయాలంటూ మహిళల ఆందోళన…

లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు)తణుకు మండలం తేతలిలో ఉన్న లెహ్యం ఫుడ్ ప్రోడక్ట్ (గోవధ) పరిశ్రమ వెంటనే ముసివేయాలని కోరుతూ మహాలక్ష్మి నగర్, అండర్ బైపాస్, కొండలమ్మ పుంత నుండి స్థానిక ప్రజలుతో పాటు మహిళలు తణుకు తహసీల్దార్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ DVVS అశోక్ వర్మ ని కలిసి వినతిపత్రం అందజేశారు. ఆ పరిశ్రమ నుండి వస్తున్న దుర్వాసన, వ్యర్థ్యాలతో అక్కడ నివసించలేకపోతున్నామని, ఆ పరిశ్రమలో అధిక శాతంలో గోవధ జరుగుతుందని, విపరీతంగా అక్కడ నుండి దుర్వాసన వస్తుందని తహసీల్దార్ వర్మకి మహిళలు తెలియజేశారు. ఆ పరిశ్రమ అక్కడ నుండి తొలిగించకపోతే తాము అనారోగ్యాల పాలైపొతామని, నీరు కూడా కలుషితం అయ్యే అవకాశం ఉందని పలువురు మహిళలు వాపోయారు. బాధితుల నుండి వినతిపత్రం తీసుకున్న తహసీల్దార్ వర్మ మాట్లాడుతూ ఆ పరిశ్రమకు ఏ అనుమతులు ఉన్నాయో తెలుసుకుంటానని, అలానే ఆ పరిశ్రమకు స్వయంగా వెళ్లి పరిశీలించి మీకు న్యాయం చేస్తామని తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *