లీడర్ భాస్కర్ న్యూస్ (విజయవాడ)జనవరి 2న పోలవరంలో కొత్త డయాఫ్రంవాల్ పనులు ప్రారంభిస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పూర్తి పనుల షెడ్యూలు సిద్ధం చేసుకుని రంగంలోకి దిగుతున్నామని చెప్పారు. ఒకసారి పనులు ప్రారంభమైన తర్వాత గంట కూడా వృధా కాకుండా పనులు చేసుకుంటూ వెళ్లేలా షెడ్యూలు సిద్ధమవుతోందని మంత్రి రామానాయుడు పేర్కొన్నారు. డ్యాంతో పాటే పునరావాస పనులూ పూర్తిచేస్తామని ఆయన వెల్లడించారు.
గంట కూడా వృథా కారాదు: మంత్రి రామానాయుడు
10
Dec