లీడర్ డిజిటల్ న్యూస్ (తణుకు)కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో తణుకు నియోజకవర్గంలో అభివృద్ధి & సంక్షేమానికి కలిపి 226 కోట్ల వరకూ వెచ్చించడం జరిగిందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు.కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో సుపరిపాలన అందించడానికి అహర్నిశలు కృషి చేస్తుందని చెప్పారు.రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుండి మరుగున పెట్టిన అనేక అభివృద్ధి పనులను కూటమి ప్రభుత్వం పరుగులు పెట్టిస్తుందని పేర్కొన్నారు. రోడ్లు నిర్మాణాలు, పోలవరం నిర్మాణం, రాజధాని అమరావతి నిర్మాణం లాంటి వాటిపై దృష్టి సారించి పనులు చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో అన్నా క్యాంటిన్ల ద్వారా పేదలకు భోజన సదుపాయం కల్పిస్తుందన్నారు.ముఖ్యంగా తణుకు నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సదుపాయం కల్పించడం జరిగిందన్నారు. తణుకు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసి, ఏపీలో మొదటి స్థానంలో నిలుపుతానని ఎమ్మెల్యే రాధాకృష్ణ తెలియజేశారు.
తణుకు నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమానికి వెచ్చించింది 226 కోట్లు – ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ
12
Dec