ప్రభుత్వాసుపత్రి కాంట్రాక్టు పారిశుధ్య కార్మికుల 4 నెలల వేతనబకాయిలు తక్షణమే చెల్లించాలి – కొనాల భీమారావు

లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు) కేంద్ర జిల్లా ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు పారిశుధ్య కార్మికుల నాలుగు నెలల వేతనబకాయిలు తక్షణమే చెల్లించాలని, పిఎఫ్ సొమ్ము కార్మికుల ఖాతాల్లో సక్రమంగా జమ చేయాలని, 150 పడకల జిల్లా కేంద్ర ఆసుపత్రి స్థాయి కనుగుణంగా పారిశుధ్య కార్మికుల నియామకం జరపాలని ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు, మెడికల్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ తణుకు శాఖ అధ్యక్షులు కోనాల భీమారావు డిమాండ్ చేశారు.గురువారం తణుకు కేంద్ర జిల్లా ఆసుపత్రి ఎదుట కాంట్రాక్టు పారిశుధ్య కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కారం కోరుతూ ధర్నా నిర్వహించి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వి.అరుణకు అందజేశారు.ఈసందర్భంగా భీమారావు మాట్లాడుతూ ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులకు ఇస్తున్న వేతనాలే అతితక్కువని వాటిని కూడా సకాలంలో చెల్లించకపోతే వారెలా జీవించాలని ప్రశ్నించారు.పిఎఫ్ సొమ్ము కార్మికుల ఖాతాల్లో సక్రమంగా జమ కావడం లేదన్నారు.ఫస్ట్ ఆబ్జెక్ట్ ప్రైవేటు లిమిటెడ్ కాంట్రాక్టర్ కాంట్రాక్టు పొంది నలఫై రెండు నెలల కాగా కేవలం 15 నెలలకే పిఎఫ్ సొమ్ము కార్మికుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు.మరో 27 నెలలకు సొమ్ము జమ చేయవలసి వుందన్నారు.పిఎఫ్ చట్ట ప్రకారం కార్మికుల వాటాగా ఎంత సొమ్ము పిఎఫ్ కు ఎంత సొమ్ము జమ చేస్తారో అంత సొమ్ము ప్రభుత్వం నుంచి కూడా జమ చేయవలసి వుండగా కేవలం కార్మికుల నుంచి మాత్రమే పిఎఫ్ సొమ్ము జమ చేస్తూ ప్రభుత్వమే కార్మికుల శ్రమ దోపిడీకి పాల్పడుతుందడడం బాధాకరమన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *