వైసీపీకి గ్రంధి శ్రీనివాస్ రాజీనామా…త్వరలోనే తన రాజకీయ భవిష్యత్తుపై ప్రకటన..!

లీడర్ భాస్కర్ న్యూస్ (భీమవరం) వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు.ఈ సందర్భంగా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, పలువురు జిల్లా నాయకులపై గ్రంధి శ్రీనివాస్ సంచలన కామెంట్ చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తల కష్టాలను జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవడం లేదు. గత నెల ఆరోవ తేదీన జగన్మోహన్ రెడ్డిని కలిసిన సమయంలో నాపై ఐటి దాడులు కూడా జరిగాయి. ఈ సమయంలో నాకు వచ్చి ఏడాది మే నెల వరకు సమయం కావాలని ఆయనను కోరడం జరిగింది. కానీ ఈ లోగానే జిల్లాకు చెందిన కొంతమంది నాయకులు ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తూ తనను చిన్నచూపు చూశారు.రాబోయే రోజుల్లో ప్రజల అభిమానాన్ని దృష్టిలో పెట్టుకుని ఏ పార్టీకి వెళ్లాలనే దానిపై నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *