లీడర్ భాస్కర్ న్యూస్ (ఏలూరు) వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రివర్యులు వైస్ జగన్మో హన్ రెడ్డి పిలుపు మేరకు కూటమి సర్కారుపై పొరబాటులో భాగంగా, ప్రభుత్వం రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం అందజేసినట్లు ఏలూరు పార్లమెంట్జ ఇంచార్జ్ కారుమూరి సునిల్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు, కైకలూరు మాజీ శాసనసభ్యులు దూలం నాగేశ్వరావు (DNR) , పోలవరం మాజీ శాసనసభ్యులు తెల్లం బాలరాజు, చింతలపూడి నియోజకవర్గ ఇన్చార్జ్ విజయరాజు కంభం (Kvr) ఉంగుటూరు మాజీ శాసనసభ్యులు పుప్పాల వాసుబాబు, నూజివీడు మాజీ శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు,ఏలూరు నియోజకవర్గం ఇంచార్జ్ జయప్రకాష్ తో కలిసి పాల్గొనడం జరిగిందన్నారు.
రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి – కారుమూరి సునీల్ కుమార్..
13
Dec