లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు)సాగు నీటి సంఘం ఎన్నికల్లో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ బలపరిచి NDA కూటమి తరపున పోటీలో నిలబడిన మొత్తం 148 మంది (టీడీపీ-107, జనసేన-33, బిజెపి 8) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇందులో 12 ప్రెసిడెంటు అభ్యర్థులు, 14 వైస్ ప్రెసిడెంటు అభ్యర్థులు, 122 మెంబర్లు గా ఉన్నారు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ శుభాకాంక్షలు తెలుపుతూ, విజయం సాధించిన వారు తమ తమ పరిధిలోని సాగునీటి సమస్యలను పరిష్కరించడానికి తమ వంతు కృషి చేయాలని, సూచించారు. వీరికి తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది అని తెలిపారు.
తణుకు సాగు నీటి సంఘం ఎన్నికల్లో NDA కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక…
15
Dec