పశువధశాలకు అనుమతులు లేవు.. అధికారులు కొమ్ము కాయడం దారుణం – గో- సంరక్షణ సభ్యులు

లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు)స్థానిక తుమ్మలపల్లిక ళాక్షేత్రం ప్రాంగణంలో తణుకు గోసేవా సమితి వారి ఆధ్వర్యంలో తేతలి గ్రామ పరిధిలో చట్టవ్యతిరేకంగా నిర్మాణాలు చేసుకొని చట్టవ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న లేహమ్ ఫుడ్స్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చర్యలు తీసుకోని కారణంగా అధికారుల నిర్లక్ష్యంపై ఆంధ్రప్రదేశ్ గో ఆధారిత, ప్రకృతి వ్యవసాయదారుల సంఘ ఏపీ అధ్యక్షులు భూపతిరాజు రామకృష్ణంరాజు మండిపడ్డారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వారి స్వంత గ్రామమైన తేతలిలో ప్రజల మనోభావాలకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన సదరు పశువధశాలపై గత 10 సంవత్సరాలుగా సంబంధిత అధికారులకు వారిచ్చిన చట్టవ్యతిరేకమైన అనుమతులను ప్రశ్నించి వారిచ్చిన అనుమతులను ఉపసంహరించుకునేటట్లు చేసామని గుర్తుచేసారు. సంబంధిత అధికారులు పూర్వం చేసిన తప్పులే మరలా చేసి సదరు కబేళాకు కొమ్ముకాస్తున్నారని ఆవేదన వ్యక్తంచేసి, సదరు అధికారులు తీసుకున్న చట్టవ్యతిరేక చర్యలను తీవ్రంగా ఖండించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొండ్రెడ్డి శ్రీనివాసు గోసేవా సమితి నాయకులు మాట్లాడుతూ గత 20సంవత్సరాలనుండి లేహమ్ ఫుడ్స్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థవారు తప్పుడు పత్రాలతో అధికారులను తప్పు దారి పట్టించిన విషయాలను గుర్తించి, వారు పొందిన అనుమతులను రద్దు చేయడానికి పనిచేసి మరియు మరలా రెండవసారి అధికారులతో కలిసి కుట్ర పూరితమైన, చట్టవ్యతిరేకమైనఅనుమతులు ఇచ్చిన ఉత్తర్వులను గౌరవ హైకోర్టువారి దృష్టికి తీసుకువెళ్ళి సదరు అధికారుల ద్వారా సదరు సంస్థయొక్క కార్యకలాపాలు నిర్వహించకుండా అడ్డుకోవడం జరిగిందని తెలియజేశారు.చట్టవ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న లేహమ్ ఫుడ్స్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థనుప్రజలందరం కలిసి నిలుపుదల అయ్యేంతవరకు విశ్రమించకూడదని కొండ్రెడ్డి శ్రీనివాసు పిలుపునిచ్చారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *