ఎండనకా.. వాననకా గిరి పుత్రుల కోసం పని చేస్తా – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

లీడర్ భాస్కర్ న్యూస్ (విశాఖపట్నం)

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

• మూడు దశల్లో ఏజెన్సీ ప్రాంతాల రోడ్ల అభివృద్ధి
• పర్యాటకంగా మన్యం ప్రాంతాన్ని తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళిక
• యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తాము
• గిరిజనుల వెతలు స్వయంగా తెలుసుకొనేందుకే కొండపైకి నడిచి వెళ్ళాను
• గత ప్రభుత్వంలో గిరిజనుల కోసం ఒక్క పని చేసింది లేదు
• రూ.500 కోట్లతో ఋషికొండ ప్యాలెస్ కట్టారుగానీ గిరిజన గ్రామాలకు కనీసం రోడ్డు కూడా వేయలేదు
• అప్పులు, తాకట్టులతో ప్రజాధనం వృథా చేశారు
• గిరిజన ప్రాంతాల్లో ప్రతి రెండు నెలలకోసారి పర్యటన చేపడతాను
• సాలూరు నియోజకవర్గంలో బాగుజోల – సిరివర రోడ్డుకు శంకుస్థాపన చేసిన అనంతరం గిరిజనులతో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్
‘దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు అయినా ఇప్పటికీ గిరిజన ప్రాంతాల్లో సరైన రోడ్డు సౌకర్యాలు లేకపోవడంతో సకాలంలో వైద్య సదుపాయం అందక అడవి బిడ్డలు మృత్యువాత పడడం కలిచివేసే విషయం. గిరిజనుల ప్రాణాలన్నా, వారి సంక్షేమమన్నా గత పాలకులకు ఎందుకో నిర్లక్ష్యం ఆవహించింది. గత ఐదేళ్ల పాలనలో గిరిజన అభివృద్ధికి దృష్టి పెట్టింది లేదు. రుషికొండ ప్యాలస్ ను రూ. 500 కోట్లతో నిర్మించడం, వెనకబడిన జిల్లాలకు చెందాల్సిన నిధులను పక్కదారి పట్టించడం తప్పితే ఇక్కడ అభివృద్ధిని గత పాలకులు పూర్తిగా విస్మరించార’ని ఉప ముఖ్యమంత్రి వర్యులు  పవన్ కళ్యాణ్  ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికీ నిరక్ష్యరాస్యత, పేదరికం, ఆకలికేకలు, అనారోగ్యం వంటి అంశాలు పట్టిపీడుస్తున్నాయన్నారు. ప్రజలకు ఎంతో బాధ్యతగా కొత్త మార్పు కోసం సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని, వారి ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామని చెప్పారు. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో రెండు నెలలకు ఒకసారి కచ్చితంగా పర్యటించి క్షేత్రస్థాయి పర్యటన చేసి సమస్యలు తెలుసుకుంటానని స్పష్టం చేశారు. సాలూరు నియోజకవర్గం మక్కువ మండలం బాగుజోల నుంచి సిరివర గ్రామం వరకు రూ. 9 కోట్లతో తారు రోడ్డు నిర్మించే పనులకు పవన్ కల్యాణ్  శంకుస్థాపన చేశారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి  గుమ్మిడి సంధ్యారాణి  ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం పంచాయతీరాజ్ శాఖ ఉపాధి హామీ నిధులతో ఏజెన్సీ ప్రాంతంలో నిర్మించబోయే రోడ్లకు సంబంధించిన చిత్ర ప్రదర్శనను తిలకించారు. శంకుస్థాపన చేసిన ప్రదేశం నుంచి సిరివర వెళ్ళే కొండప్రాంతం మీదకు ఉన్న కచ్చా రోడ్డును పరిశీలించేందుకు కాలినడకన వెళ్లారు. స్వయంగా గిరిజన నివాస ప్రాంతాలకు వెళ్ళి వారితో మాట్లాడారు. అనంతరం బాగుజోలకు వచ్చి గిరిజనులతో మాటామంతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా  పవన్ కళ్యాణ్  మాట్లాడుతూ “మనసుంటే మార్గం ఉంటుంది. అడవి, కొండలను నమ్ముకొని జీవించే గిరిపుత్రుల కష్టాలు తీర్చాలనే ఆలోచన ఉంటే కచ్చితంగా ఏదో ఒక మార్గం కనిపిస్తుంది. గత ప్రభుత్వం ఏనాడు గిరిజనుల అభ్యున్నతి, అభివృద్ధిపై దృష్టి పెట్టింది లేదు. విశాఖపట్నంలో విలువైన ఆస్తులను తాకట్టు పెట్టి వేల కోట్లు అప్పులు తెచ్చారు. ఆ సొమ్ములు మళ్లించారు. రుషికొండ ప్యాలస్ కు విలువైన ప్రజాధనం వెచ్చింది వృథా చేశారు. గిరిజన గ్రామాలకు కనీసం రోడ్డు సౌకర్యం కూడా కల్పించలేదు. రాష్ట్ర విభజన చట్టంలో వెనుకబడిన గ్రామాలకు సంబంధించి తీసుకొచ్చిన రూ. 690 కోట్లు ఎక్కడికి వెళ్లాయో తెలియదు. ఏనాడు గిరిజన ప్రాంతాల్లో ఒక్కసారి కూడా గత పాలకులు సందర్శించిన దాఖలాలు లేవని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *