తణుకులో పశువధ పరిశ్రమ మూసివేయాలంటూ ప్రజలు నిరసన…

లీడర్ న్యూస్ (తణుకు) లేహ్యం ఫుడ్ ప్రాసెస్ ఫ్యాక్టరీ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న తేతలి పరిసర గ్రామాల ప్రజలు గురువారం లేహం ఫుడ్డ్ ఫ్యాక్టరీ ( పశు వధ ) మూసివేయాలంటూ నిరసన ప్రదర్శన చేపట్టారు. తీవ్ర దుర్గంధం కారణంగా చంటి పిల్లలు, వృద్ధులు, అనారోగ్య కారణాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాటినుండి తమకు విముక్తి కల్పించాలని కోరుతూ గో సేవా సమితి సభ్యులు శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా తణుకులో రాష్ట్ర మాజీ పౌరసరఫరాల  శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు లేహ్యం ఫుడ్ ప్రొడక్ట్స్ ఎదురుగా శాంతియుత ప్రదర్శన చేస్తున్న పరిసర గ్రామాల ప్రజలకు సంఘీభావంగా నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ వైసిపి ప్రభుత్వం పరిపాలనలో ఉన్నంతకాలం ఢిల్లీ స్థాయిలో ఒత్తిళ్లు వచ్చిన లేహం ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థను పశువధ కార్యకలాపాలు చేయనివ్వలేదని అన్నారు. కానీ నేడు కూటమి ప్రభుత్వం పాలనలో ఉండి తణుకు నేలమీద ఇంతటి రక్తపాతం జరుగుతూ ఉంటే ఆపవలసిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు చూస్తుందని ఇదేనా మంచి ప్రభుత్వం అంటే అని కారుమూరి అన్నారు. నేడు తేతలి గ్రామ ప్రజలు చేస్తున్న పోరాటానికి ఎంతవరకు అయినా తాను అండగా ఉంటానని, నెత్తురుతో తడిసి ముద్దవుతున్న తణుకు నేలను పర్యావరణాన్ని కాపాడుకుందాం అని కారుమూరి అన్నారు. ఈ విషయమై అఖిలపక్షం ఏర్పాటుకు పిలుపు ఇవ్వడం జరిగిందని రేపటినుండి జరుపవలసిన కార్యక్రమాల పై అఖిలపక్షంలో చర్చించి పార్టీలకు అతీతంగా అందరూ కలిసి ఉద్యమం చేద్దామని పిలుపునిచ్చారు. ఎన్నో కుటుంబాలు దుర్గంధం వలన కనీసం ఆహారం తినే పరిస్థితి కూడా లేదని, ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్నుకున్న స్థానిక ఎమ్మెల్యే వెంటనే స్పందించి ఈ సమస్యపై పశువధ నిలుపుదల చేసే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ విధంగా పశువుల జరగడం వల్ల ఈ ప్రాంత ప్రజలకే కాకుండా తణుకు ప్రజలకు కూడా మంచిది కాదని, ఈ ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థను మూసివేసే వరకు తాను పనిచేస్తానని కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. ఈ కార్యక్రమంలో తేతలి గ్రామ మాజీ సర్పంచ్ కోట నాగేశ్వరరావు, వైసిపి నాయకులు జల్లూరి జగదీష్, వీరమల్ల ఫణీంద్ర, గో సేవా సమితి సభ్యులు కొండ్రెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *