లీడర్ భాస్కర్ న్యూస్ (భీమవరం)ప్రభుత్వ వైద్య సిబ్బంది మనసు పెట్టి పనిచేస్తే, పేదలు ఆర్థిక ఇబ్బందులకు గురి కాకుండా కృషి చేయవచ్చని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు.స్థానిక త్యాగరాజ భవన్ లో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి వైద్య, ఆరోగ్యశాఖ మరియు స్త్రీ శిశు, సంక్షేమ శాఖల అధికారులు, సిబ్బందితో ఆయా శాఖల లక్ష్యాలు, లోటుపాట్లుపై సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ వైద్య సిబ్బంది, ఐసిడిఎస్ సిబ్బందితో ఇప్పటికే రెండు పర్యాయాలుగా సమీక్షించడం జరిగిందన్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ఈ సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని, ఇందుకు అనుగుణంగా వైద్య సిబ్బంది తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని ఆదేశించారు. పేదలు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించి అప్పులు పాలు కాకుండా చూసే బాధ్యత మీపై ఉందనే విషయాన్ని మీరు నిరంతరం గుర్తుంచుకోవాలన్నారు. మాతృ మరణాలు, శిశు మరణాలు నియంత్రణ లక్ష్యంగా ఎప్పటికప్పుడు తగు వైద్య జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే తక్కువ బరువు, ఎత్తు గలిగిన చిన్నారులకు పౌష్టికాహారాన్ని, వైద్య సహాయాన్ని అందించాలన్నారు.
పేదలు ప్రవేయిట్ ఆసుపత్రులను ఆశ్రయించి అప్పులపాలు కాకూడదు – జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
28
Dec