లీడర్ న్యూస్ (భీమవరం) అనుమతిలేని పిల్లల దత్తతును ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, అలా జరిగితే సంబంధిత గ్రామ అధికారులపై చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి హెచ్చరించారు.స్థానిక కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి కార్యక్రమాల కన్వర్జెన్సీ సమావేశాన్ని సభ్యులైన సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మూడవ అడిషనల్ డిస్టిక్ జడ్జి మరియు భీమవరం మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ ఎం.ఏ సోమశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో మహిళలు, ఆడపిల్లలు, చిన్నారులు స్వేచ్ఛగా జీవించేందుకు అన్ని విధాల చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అనుమతులేని పిల్లల దత్తతులు ఎట్టి పరిస్థితుల్లో జరగరాదన్నారు. ఎప్పటికప్పుడు గ్రామంలోని విఆర్వోలు, ఏఎన్ఎంలు, మహిళా పోలీసు, అంగన్వాడిలు సమాచారాన్ని సేకరించి అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ఎక్కడైనా ఇటువంటి దత్తతలు జరిగితే సంబంధిత సిబ్బందిపై చర్యలు తప్పవని గట్టిగా హెచ్చరించారు.
అనుమతిలేని పిల్లల దత్తతను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు – జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
31
Dec